Friday, April 19, 2024

టెన్త్ పరీక్షలు వాయిదా

- Advertisement -
ప్రీ ఫైనల్స్ ఫలితాల ఆధారంగా విద్యార్థులను అప్‌గ్రేడ్ చేసే అవకాశాల పరిశీలన?
వాయిదా నిర్ణయాన్ని ప్రకటించిన
మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
జిహెచ్‌ఎంసి మినహా రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు అనుమతించిన హైకోర్టు
తీర్పు వచ్చిన తర్వాత మొత్తం పరీక్షల వాయిదాకు నిర్ణయించిన ప్రభుత్వం
ఇప్పటికే జరిగిపోయిన మూడు సబ్జక్ట్‌ల పరీక్షలు
పరీక్షల నిర్వహణపై అంతిమ నిర్ణయం నేడు సిఎం కెసిఆర్ అత్యవసర సమీక్ష జరిపే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు మరోసారి వా యిదా పడ్డాయి. పది పరీక్షలను జిహెచ్‌ఎంసి పరిధిలో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలతో నిర్వహించాలని శనివారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంట నే విద్యాశాఖ అధికారులు న్యాయస్థానం ఆదేశాలు, టెన్త్ పరీక్షల నిర్వహణపై సమీక్షించి, ప్రభుత్వ అనుమతితో పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రకటన విడుదల చేశారు. పదవ తరగతి పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి త్వరలో ముఖ్యమంత్రి వద్ద సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని పేర్కొన్నారు.
గతంలో హైకోర్టు ఆదేశాలతో వాయిదా
పదవ తరగతి వార్షిక పరీక్షలు ఈ ఏడాది మార్చి 19వ తేదీన ప్రారంభం కాగా, మూడు పరీక్షలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం టెన్త్ పరీక్షలను వాయిదా వేసింది. ఆ తర్వాత న్యాయస్థానం అనుమతితో మిగిలిన ఎనిమిది ప్రధాన పరీక్షలకు ఈ నెల 8 నుంచి జూలై 5వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసి, అందుకు అ నుగుణంగా ఏర్పాట్లు చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది.
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు భౌతి క దూరాన్ని పాటించాలన్న హైకోర్టు సూచనలకు అనుగుణంగా గతంలో ఉన్న 2,530 పరీ క్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేం ద్రాలను ఏర్పాట్లు చేశారు.అయితే పది పరీక్షలను జిహెచ్‌ఎంసి పరిధిలో తప్ప మిగిలిన అన్ని చోట్లా తగిన జాగ్రత్తలతో నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం శనివారం సాయంత్రం ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రభు త్వం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పది పరీక్షలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం అత్యవసర సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పది పరీక్షల కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలను రద్దు చేసి, ప్రీ ఫైనల్ పరీక్షల ప్రాతిపదికగా అప్‌గ్రేడ్ చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించనున్నట్లు తెలిసింది. విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం వాయిదా వేసిన పది పరీక్షలను తర్వాత నిర్వహించడం, పది పరీక్షల రద్దుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ రెండు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వద్ద చర్చించి అనంతరం తుది నిర్ణయం వెల్లడించనున్నారు. గత కొన్నిరోజులుగా పది పరీక్షల నిర్వహణ సందిగ్ధత కొనసాగుతూనే వస్తోంది. సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా మళ్లీ వాయిదా పడిన నేపథ్యంలో అసలు పది పరీక్షలు జరుగుతాయా..? లేక రద్దవుతాయా..? అని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పది పరీక్షలపై అన్ని అంశాలు చర్చించి ప్రభుత్వం ఆదివారం తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.
పరీక్షల వాయిదాను స్వాగతిస్తున్నాం : పిఆర్‌టియు
కోవిడ్- 19 దృష్టా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పది పరీక్షలను వాయిదా వేయడాన్ని పిఆర్‌టియు స్వాగతించింది. ఈ పరీక్షలను పూర్తిగా రద్దు చేసి అంతర్గత మూల్యాంకనం ద్వారా జిపిఎ నిర్ణయించి ఫలితాలను ప్రకటించాలని పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావులు ఒక ప్రకటనలో సూచించారు.
10th Class Exams postponed due to Corona in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News