Friday, April 19, 2024

మహిళపై లైంగిక వేధింపులు.. 11మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

11 Arrested for sexual harassment in Maharashtra

థానే: మహారాష్ట్రలో ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడి, ఆమె స్నేహితులపై దాడి చేసిన ఘటనలో 11మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వేళ థానేలోని కోల్సేవాడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒంటరిగా ఆటోలో వెళ్తున్న మహిళపై ఆటో డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడగా, ఆమె తన ఇద్దరు స్నేహితులను ఫోన్ చేసి పిలిచారు. మరోవైపు ఆటోడ్రైవర్ స్థానిక గ్రామస్థులను పిలిచాడు. దాంతో, గ్రామస్థులు మహిళ ఇద్దరు స్నేహితులపై బెల్టులు, ఇతర మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. వారిలో కొందరు మహిళపై మరోసారి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, 11మందిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. వీడియో తీసిన వ్యక్తి దానిని పోలీసులకు కూడా ట్విట్ చేశారు.

11 Arrested for sexual harassment in Maharashtra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News