Home తాజా వార్తలు ఓ ఇంట్లో 11 మృతదేహాల కలకలం

ఓ ఇంట్లో 11 మృతదేహాల కలకలం

11-Dead-Bodies-Found-in-Bur

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీలో ఆదివారం ఉదయం మృతదేహాల కలకలం సృష్టించాయి. ఓ ఇంట్లో 11 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరివేసుకొని 11 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ఆర్థిక సమస్యలతో వీళు ఆత్మహత్య చేసుకొని ఉంటారని మృతుల బంధువుల పేర్కొన్నట్టు సమాచారం. వీళ్లు కళ్లకు గంతలు కట్టుకొని, నోట్లో గుడ్డలు కుక్కుకొని ఉరివేసుకొని ఉండడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.