Home అంతర్జాతీయ వార్తలు కూలిన బంగారు గని.. 11మంది సజీవ సమాధి

కూలిన బంగారు గని.. 11మంది సజీవ సమాధి

Gold-Mineజకార్తా: ఇండోనేషియాలోని జాంబీ ప్రావిన్స్‌లో ఓ బంగారు గని కుప్పకూలిన ఘటనలో 11మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. స్థానిక మీడియా సమాచారం ప్రకారం సింపంగ్ పరిట్ గ్రామం సమీపంలో గల ఈ గనిలో దాదాపు 50 మీటర్ల లోపల ప్రమాదం జరిగింది. కాగా, ప్రమాదంలో చిక్కుకున్న మరికొందరిని రక్షించడానికి రెస్కూ టీం ఎలాంటి భారీ యంత్రాలను వినియోగించలేకపోతుంది. దీనికి కారణం ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకోవడానికి సరియైన మార్గం లేకపోవడమేనని విపత్తు నిర్వహణ సిబ్బంది అధికారులు తెలిపారు. దీనికితోడు ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది.