Friday, April 19, 2024

ఉచిత రేషన్ పంపిణీ లో తొక్కిసలాట :11మంది మృతి

- Advertisement -
- Advertisement -

కరాచి: పాకిస్థాన్‌లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కరాచీలో శుక్రవారం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 11 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు పాకిస్థాన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ పత్రిక తెలియజేసింది. మృతుల్లో పిల్లలతో పాటుగా మహిళలు కూడా ఉన్నారు. రేషన్ పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు పిల్లలు, మహిళలు స్పృహ కోల్పోయినట్లు కూడా ఆ పత్రిక తెలిపింది.

కరాచీలోని సింధ్ ఇండస్ట్రియల్ ట్రేడింగ్ ఎస్టేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో ఎనిమిది మంది మహిళలు, ముగ్గరు చిన్నారులున్నట్లు జియో న్యూస్ తెలిపింది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్‌లో చారిటీ సంస్థలు చేపట్టిన ఉచిత రేషన్ పంపిణీ సందర్భంగా మరణాలు, తొక్కిసలాటలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా తాజా ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News