Home జాతీయ వార్తలు బస్సు-కంటైనర్ ఢీ: 11 మంది మృతి

బస్సు-కంటైనర్ ఢీ: 11 మంది మృతి

 

ముంబయి: మహారాష్ట్రాలోని ధులే జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షాహెద-దండియచా రహదారిలోని నిమ్ గుల్ గ్రామ శివారులో కంటెనర్-బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో 11 మంది ఘటనా స్థలంలో దుర్మరణం చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ధులే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు ఔరంగాబాద్ గా గుర్తించారు. చనిపోయినవారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం ధులే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ క అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు. 

 

11 Members Dead in Container Collided to Bus