Tuesday, March 21, 2023

నల్లగొండ జిల్లాలో 11,143 మంది నేరస్థులు..

- Advertisement -

police

*నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో నేరస్థుల సమగ్ర సర్వే
*నల్లగొండ జిల్లా కేంద్రంలోనే 9057 మంది నివాసం
*జిల్లాలో నేరం చేసి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న నేరస్థులు 2086
*ఇతర ప్రాంతాల్లో నేరం చేసి నల్లగొండ జిల్లాలో నివసిస్తున్న వారు 652మంది

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లాలో నేరస్తుల సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయ న మన తెలంగాణతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లా లో గత 10 సం॥ కాలంలో వివిధ నేరాల్లో మొత్తం 11,143 మంది నేరస్తులను గుర్తించడం జరిగిందని, ఈ నేరస్థులలో 9,057 మంది నల్లగొండ జిల్లాలోనే నివసిస్తున్నారన్నారు. జిల్లాలో నేరం చేసి ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న నేరస్థులు 2,086 మంది, ఇతర ప్రాంతాల్లో నేరం చేసి నల్లగొండ జిల్లాలో నివసిస్తున్న నేరస్థులు 652 మంది ఉన్న ట్లు ఆయన తెలిపారు. ఈ సర్వే ద్వారా నేరస్థులు , నేర ప్రవృతి కలిగిన వారిని గుర్తించి జియో ట్యాగింగ్, వేలి ముద్రలు సేకరించడం ద్వారా నిరంతరం నిఘాపెట్టి నేరాలను అరికట్టడం నేరస్తులను గుర్తించడం జరుగుతుందన్నారు. జిల్లాలో నివాసం కలిగి ఉంటున్న నేరస్థులు 9057 మంది వివరాలు సేకరించడానికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి, హోంగార్డ్‌లు మొత్తం కలిపి 300 టీంలుగా ఏర్పడి ఈ సర్వేలో పాల్గొన్నారు. నేరస్తులకు సంబంధించి అన్ని కోణాల్లో సమగ్ర సమాచారం అందుబాటులోకి తెస్తూ ప్రస్తుతం నేరస్థులు చేస్తున్న పని వివరాలు నమోదు చేయ డం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమగ్ర సమాచారాన్ని టిఎస్.సిఓపి అప్లికేషన్‌లో నమోదు చేయనున్నట్లు వివరించారు. ఈ టిఎస్.సిఒపి అప్లికేషన్‌కి సంబంధించి 120 టాబ్స్ జిల్లాకు మంజూరు చేయడం జరిగిందని, పోలీసు స్టేషన్‌లో పని చేసే బీ ట్ కానిస్టేబుల్‌కి, ఐడి పార్టీ టీం, ఇన్వెస్టిగేషన్ అధికారికి టాబ్స్ ఇచ్చి నేరస్తుల సమాచారం ఆధారంగా నిరంతరం నిఘా ఉంచి నేరాలను అరికట్టడం నేరస్థులను గుర్తించడం జరిగిందన్నారు. నేరాలను అరికట్టడంలో సిసి కెమెరాలు ప్రాముఖ్యత కలిగి ఉన్నందున నేను సైతం ప్రాజెక్టులో భాగంగా ప్రజలు భాగస్వామ్యంతో, జిల్లా పోలీస్ నిధుల ద్వారా ఇప్పటి వరకు 823 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నేరాలను అధుపుచేసేందుకు అదనంగా 250 సిసి కెమెరాల ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ సంవత్సరంలో 1000 సిసి కెమెరాలు టార్గెట్‌గా చేసి అన్ని పట్టణాల్లో, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో..
మన తెలంగాణ/సూర్యాపేట: నేరస్తుల సమగ్ర సర్వేతో జిల్లా వ్యాప్తంగా నేరస్తుల పూర్తి వివరాలు తెలిపే విధంగా శాశ్వత రికా ర్డు సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ అన్నారు. గురు వారం జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్‌లో నేరస్థులు సమ గ్ర సర్వేను ఆయన ప్రారంభించి మాట్లాడారు. డిజి ఆదేశాల ను సారం రాష్ట్ర వ్యాప్తంగా నేరస్థుల సమగ్ర సర్వేను నిర్వహిస్తున్న ట్లు చెప్పారు. జిల్లాలో 10,621 మంది నేరస్థుల సమాచారం ఉండ గా సూర్యాపేట జిల్లాకు చెందిన 8,860 మంది, ఇతర జిల్లాలకు చెందిన 1,114 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన 647 మంది నేరస్తుల వివరాలు జిల్లాలో ఉన్నాయన్నారు. జిల్లాలో 114 టీంలను ఏర్పాటు చేసి నేరస్తుల సమగ్రమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. నేరస్థులు నుంచి ఆధార్‌కార్డు, పాస్ ఫొటోలతో పాటు నేరస్థుడి ఫింగర్ ఫ్రింట్‌ను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేశ్వరరావు, సిఐ శివశంకర్, ఎస్సై దానియేలు, సిబ్బంది కరుణాకర్ పాల్గొన్నారు.
పెన్‌పహాడ్‌లో
పాత నేరస్తుల సమగ్ర సర్వేకు సహకరించాలని ఎస్సై కేటి మల్లెష్ అన్నారు. మండల పరిధిలోని అనంతారం గ్రామంలో సర్వే నిర్వ హించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ఉత్తర్వు మేరకు 2008 సంవత్సరం నుంచి 2017 సంవత్సరం వరకు పోలీసు రికార్డుల ప్రకారం మొత్తం మండల పరిధిలో 243 మంది పాత నేరస్థులు ఉన్నట్లు తెలిపారు. బయోమెట్రిక్, జియోట్యాగింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. గురువారం దూపహాడ్, గాజుల మల్కాపురం, అన్నారం, నారాయణగూడెం, మొరసకుంట, జానారెడ్డి నగర్, సింగారెడ్డిపాలెం గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమమంలో ఏఎస్సై కనకరత్నం, రాములు, అశోక్, రమేష్‌గౌడ్, యాదగిరి, నాగయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles