Home జిల్లాలు 114 పరిశ్రమల తరలింపునకు రంగం సిద్ధం

114 పరిశ్రమల తరలింపునకు రంగం సిద్ధం

గ్రేటర్ నుండి కాళ్ళకల్ గ్రామానికి 

ఏర్పాట్లలో 80.. రుణాల వేటలో 34 పరిశ్రమలు
నాలాల్లోకి రసాయనజలాలు వదలినందుకే
జీడిమెట్లలో జీపీఎస్‌తో నిఘా
అనంతరం పటాన్‌చెరుపై నజర్

industriesసిటీబ్యూరో: నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరి స్తోన్న పరిశ్రమలను గ్రేటర్ హైదరాబాద్ నుండి తరలించేందుకు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) రంగం సిద్ధం చేసింది. కలు షిత జలాలను నాలాల్లో వదులుతున్న వీటికి పలుమార్లు హెచ్చరికలు చేసినా పెడచెవిన పెట్టినందున తరలింపు అనివార్యమైనట్టు అధి కార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అ యితే, పరిశ్రమల వర్గాలు కూడా అందుకు సానుకూలంగా ఉన్నాయి. ఈపాటికే అధికశా తం పరిశ్రమలు తరలివెళ్ళేందుకు తగిన ఏ ర్పాట్లు చేసుకున్నాయి. కూకట్‌పల్లి, బాలానగ ర్, జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాల్లోని 114 పరిశ్రమలు మెదక్‌జిల్లా ముప్పిరెడ్డిపల్లి కాళ్ళక ల్ గ్రామ పరిధిలోకి మారనున్నాయి. తెలంగా ణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల సంస్థ (టీఎస్‌ఐఐసీ)ఆ గ్రామపరిధిలో పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేసింది.

ఆ పార్క్‌లో వీటికి స్థలాలను 450-500 చ.గ.లు కేటాయించిన ట్టు పీసీబీ అధికారులు వెల్లడిస్తున్నారు. 80 ప రిశ్రమలు స్థలాన్ని తీసుకోవడంతోపాటు బ్యాంక్ రుణాలను తీసుకుని అక్కడ పరిశ్రమ ల స్థాపనకు సంబంధించిన ఏర్పాట్లలో నిమ గ్నమయ్యాయని అధికారులు వివరిస్తున్నారు. మరో 34 పరిశ్రమలు రుణాలు పొందే ప్రయ త్నంలో ఉన్నాయని, రానున్న మూడు మాసా ల్లో అవి కాళ్ళకల్ గ్రామంలో స్థిరపడనున్నట్టు సమాచారం. ఈ 114 పరిశ్రమలు తమ ఉత్ప త్తిలో భాగంగా వెలువడే కలుషిత జలాలను నాలాల్లో, జలాశయాల్లో వదలరాదని పీసీబీ పలుమార్లు ఆకస్మిక తనిఖీలు చేసి నియమనిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని హెచ్చరికలు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. అయినా అవి పీసీబీ హెచ్చరికలను ఖాతరు చేయకపోవడంతో తరలింపు కార్య క్రమం మొదలైనట్టు తెలిపారు. ఈ 114 పరిశ్రమల తరలింపు అనం తరం పటాన్‌చెరు పరిధిలోని 200 పరిశ్రమలను, దుండిగల్ ప్రాంతం లోని రాంకీ పరిశ్రమలపై చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేస్తున్నారు.
అందుబాటులో శుద్ధి కేంద్రం
జీడిమెట్ల, బాలానగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని 114 పరిశ్రమ లు వెలువరించే కలుషిత జలాలను శుద్ధి చేసేందుకు జీడిమెట్ల పారిశ్రా మికవాడలో కామన్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పీసీబీ ఏర్పాటు చేసింది. అయితే, ఇవి మాత్రం అక్కడకు కలుషిత జలాలను తరలిం చేందుకు ముందుకు రాకుండా కూకట్‌పల్లి నాలాల్లో, ఇతర కాలనీ నాలాల్లో పోయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్టు పీసీబీ గుర్తిం చింది. అనంతరం ఈ 114 పరిశ్రమలను అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు చేసి పరిశ్రమల్లో నుండి వెలువడే జలాల్లో నిబంధనల ప్రకా రంగా ఉండాల్సిన స్టాండర్డ్ ఉండటంలేదని, ఇవి ప్రమాదకరంగా ఉన్నా యని, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు చేశారు. వాటర్ ప్రొటెక్షన్ యాక్ట్ -1974 ప్రకారంగా కాలుష్యజలాల ను ఏ రకమైన జలాశయాల్లో(వాటర్‌బాడీ)కి తరలించరాదు. అందుకు విరుద్ధంగా ఈ పరిశ్రమలు రసాయనాలతో కూడిన నీటిని నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో కలిసే కూకట్‌పల్లి నాలాల్లో వదులుతున్నాయి. ఫలి తంగా నాలా ద్వారా చేరుతోన్న రసాయనాలు హుస్సేన్‌సాగర్‌ను కాలు ష్య కాసారంగా మారుస్తున్నాయి. రసాయన నీటిని శుద్ధి చేసేం దుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శుద్ధి కేంద్రాన్ని ఇవి సద్వినియోగం చేసు కోవడంలేదు. దీంతో పిసిబి అధికారులు ఈ నాలాల్లో రసాయనాల నీటిని వదులుతోన్న పరిశ్రమలను గుర్తించి వాటిపై చర్యలకు ఉపక్ర మించింది. ఫలితంగా ఇవి కాళ్ళకల్‌కు తరలిపోనున్నాయి.
జిపిఎస్‌తో నిఘా…
జీడిమెట్ల పరిధిలోని పరిశ్రమల నుండి వెలువడే రసాయనాల నీటిని కామన్ ట్రీట్‌మెంట్‌కు తరలించే విధంగా పీసీబీ చర్యలు చేపట్టి పైలెట్ ప్రాజెక్ట్‌గా జియోగ్రాఫికల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పారిశ్రామికవాడలో తిరిగే 30 ట్యాంకర్లను జీపీఎస్ విధానంలో గుర్తిస్తున్నారు. జీడిమెట్ల పరిధిలోని పరిశ్రమల నుండి వెలువడే కాలుష్య జలాలన్నీ ట్రీట్‌మెంట్ ప్లాంటకు తరలిపోతున్నాయా..? లేక పక్కదారిపట్టాయా…? అనేది జీపీఎస్ ద్వారా గుర్తిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. సాధారణ ప్రజానీకం ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా 24×7 విధానంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు ఫోన్ నం. 10741, 23812600లకు అందు బాటు లో నలుగురు సిబ్బంది ఉన్నారు. దీనికి తోడు రాత్రి 9 గం. నుండి ఉదయం 4 గం.ల వరకు తనిఖీలు చేసేందుకు రాత్రిపూట పెట్రోలింగ్ ఉంటుంది. కాగా, ఈ క్రింది ప్రమాణాలు దాటితే పరిశ్రమల జలాలు కాలుష్యం బారినపడినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.