Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎపిలో కొత్తగా 1,167 కరోనా కేసులు నమోదు

ఎపిలో కొత్తగా 1,167 కరోనా కేసులు నమోదు

1167 New Corona Cases Registered In APఅమరావతి : గడిచిన ఒక్కరోజులో ఎపిలో కొత్తగా 1,167 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు శనివారం తెలిపారు. గడిచినఒక్కరోజులో కరోనాతో కొత్తగా ఏడుగురు  చనిపోయారని వారు పేర్కొన్నారు. గడిచినఒక్కరోజులో కొత్తగా 1,487 మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వెల్లడించారు. గడిచిన ఒక్కరోజులో  55,307 మందికి కరోనా పరీక్షలు చేశామని పేర్కొన్నారు. కరోనాతో కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని, . కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 224, చిత్తూరులో 167, నెల్లూరులో 141, ప్రకాశంలో 130, పశ్చిమ గోదావరిలో 121, గుంటూరులో 110 మందికి కరోనా సోకిందని వారు పేర్కొన్నారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు తేల్చిచెప్పారు. అత్యవసర పనులు ఉంటేనే బహిరంగ ప్రదేశాలకు రావాలని, బయటకు వచ్చినప్పుడు ఆరు గజాల సామాజిక దూరం పాటించడంతో పాటు విధిగా మాస్కులు దరించాలని అధికారులు ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని అధికారులు ప్రజలను హెచ్చరించారు.