Saturday, April 20, 2024

కొత్తగా 158 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

3 Cops test Positive for Corona in Afzalgunj PS

 

ఒక్క రోజే 158 పాజిటివ్‌లు..నలుగురు మృతి
గురువారం సాయంత్రం 5 గంటల వరకు 66 మంది లోకల్ వ్యక్తులకు వైరస్
2256కు చేరిన మొత్తం బాధితులు
ఇద్దరు వలసకూలీలు, 49 మంది సౌదీలకు కోవిడ్
రెండు రోజుల్లో 17 మంది కానిస్టేబుళ్లకు కరోనా

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఏకంగా 158 మంది వైరస్ బారిన పడ్డారు. దీనిలో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు 66 మంది తెలంగాణ వారికీ, ఇద్దరు వలస కూలీలకు, 49 సౌదీ అరేబియన్స్‌కు వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు.

కానీ మరో 41 మంది ఎక్కడ వారు అనేది అధికారులు బులిటెన్‌లో వెల్లడించలేదు. అదే విధంగా వైరస్ దాడిలో మరో నలుగురు మృతి చెందారని అధికారులు ధ్రువీకరించారు. కానీ ఆ వివరాలనూ అధికారులు ప్రకటించలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 2256కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 1345కి పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 844 మంది చికిత్స పొందుతుండగా, రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 67కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇదిలా ఉండగా, గత రెండు రోజుల నుంచి పోలీసులకు కరోనా పరేషాన్ చేస్తుంది. చెక్‌పోస్టులలో డ్యూటీ చేస్తున్న వారికి కరోనా అంటుకుంటుంది. గురువారం రాత్రి వరకు మొత్తం 17 మంది కానిస్టేబుళ్లకు వైరస్ నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణకి వస్తున్న వలస కార్మికుల్లో ఇప్పటి వరకు 175 మంది వైరస్ బారిన పడ్డారని అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా 143 మంది సౌది అరేబియన్స్ వైరస్ నిర్ధారణ కాగా, ఇప్పటి వరకు 30 మంది విదేశీయులు కోవిడ్ బారిన పడ్డారు. ఇదిలా ఉండగా, ఇటీవలే సౌది అరేబియా నుంచి రెండు స్పెషల్ ప్లైట్లలో వేర్వేరు రాష్ట్రాల వారు హైదరాబాద్‌కి వచ్చారు. ఇక్కడి వచ్చాక, వీరిని నిబంధనలు ప్రకారం నేరుగా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఆధీనంలో ఉన్న క్వారంటైన్ సెంటర్లకు అధికారులు తరలించారు. అయితే ప్రస్తుతం లక్షణాలు ఉన్న వారిని టెస్టులు చేయగా, వైరస్ నిర్ధారణ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

117 New Corona Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News