Home ఆంధ్రప్రదేశ్ వార్తలు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

Road Accident
అమరావతి: చిత్తూరు జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద చిత్తూరు-బెంగళూరు నేషనల్ హైవేపై ఓ భారీ కంటెయినర్ అదుపుతప్పి ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా… మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే 108 వాహనంలో సమీప దవాఖానకు తరలించారు. బ్రేకులు ఫెయిలై అదుపుతప్పిన కంటైనర్ ఆటో, ఓమ్ని వ్యాన్, ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని డాక్టుర్లు వెల్లడించారు.
12 dead in road accident at chittoor district andhra pradesh