Thursday, April 25, 2024

ఆ 12 మంది రైతులు సేఫ్

- Advertisement -
- Advertisement -

 పరకాల చలివాగులో చిక్కుకున్న అన్నదాతలు 
 సమాచారం అందడంతో వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం
 మంత్రి కెటిఆర్ చొరవతో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలింపు
 కృతజ్ఞతలు తెలిపిన రైతు కుటుంబాలు

మనతెలంగాణ/హైదరాబాద్: భూపాలపల్లి టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామంలోని చలివాగులో చిక్కుకున్న 12 మంది రైతులను రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాలతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రైతులు వాగులో చిక్కుకున్నారని, వారిని కాపాడాలని స్థానిక శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణ రెడ్డి ఫోన్‌ద్వారా కెటిఆర్‌కు సమాచారం అందించిన వెంటనే కెటిఆర్ స్పందించారు. ఎవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్‌తో కెటిఆర్ సంప్రదింపులు జరిపి రెండు హెలిక్యాప్టర్లను సంఘటనా స్థలానికి పంపారు. వాగులో చిక్కుకున్న రైతులను హెలిక్యార్ల సహాయంతో రెస్కూ టీం సురక్షితంగా ఒడ్డుకు చేరారు. కెటిఆర్ స్వయంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకున్నందుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. సంఘటనా స్థాలాన్ని కెటిఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం, అదనపు ఎస్‌పి శ్రీనివాసులు, ఎంఎల్‌ఏ పర్యవేక్షిస్తూ రైతులను ఒడ్డుకు చేర్చేంత వరకు సహకరించారు. ఈ సందర్భంగా రిస్కూటీంను, ఏవియేషన్ అధికారులను మంత్రి కెటిఆర్ అభినందించారు. తుఫాన్ మరో రెండురోజులు ఉండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కెటిఆర్ సూచించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో పొలం, చెలక తదితర పనులకు వెళ్ళకుండా ఇల్లలోనే ఉండాలని ఆయన కోరారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు.

12 Farmers safe from heavy floods in Bhupalpally 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News