Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

12 killed in road accidents

కృష్ణా జిల్లా వేదాద్రి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మధిరకు చెందిన 12 మంది మృతి, 13 మందికి గాయలు, దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా విషాదం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టి ప్రమాదంలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గోపవ రం గ్రామానికి చెందిన 12 మంది మృతి చెం దారు. ప్రమాదంలో 13మందికి తీవ్ర గాయా లు కాగా, గాయపడిన వారిలో నలుగురి పరిస్థి తి విషమంగా ఉందని వైద్యులు వివరించారు. వివరాల్లోకి వెళితే..ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గోపవరం గ్రామానికి చెందిన దాదాపు 25 మంది మంగళవారం ట్రాక్టర్‌లో వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దైవదర్శనానికి వెళ్లారు. ఈక్రమంలో మంగళవారం రాత్రి ఆలయంలోనే బస చేశారు. బుధవారం ఉదయం మొక్కులు ముగించుకొని ఇంటికి బయలుదేరిన కొద్ది సే పటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ నేరుగా ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచా రం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలావుండగా రోడ్డు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు స్పందించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉన్న ఆయన వెంటనే జగ్గయ్య పేట ఎంఎల్‌ఎ సామినేని ఉదయభాను కి ఫోన్ చేసి తక్షణ సహాయక చర్యలు అందే విధంగా పోలీసువారికి తెలియజేయాలని కోరారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స అందే విధంగా డాక్టర్లకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. తాను అసెంబ్లీ సమావేశంలో ఉన్నానని, అయినప్పటికీ సహాయక చర్యలు తీసుకుంటామని ఎంఎల్‌ఎ సామినేని ఉదయభాను తెలియజేశారు. అసెంబ్లీ ముగిశాక ఆయన నేరుగా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మృతుల వివరాలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టి ప్రమాదంలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గోపవరం గ్రామానికి చెందిన వేమిరెడ్డి పద్మావతి (45), పూడూరు ఉపేందర్ రెడ్డి(15), వేమిరెడ్డి ఉదయ్(6), గూడూరు సూర్యనారాయణ రెడ్డి(46),లక్కిరెడ్డి అప్పమ్మ, రాజి,.అక్క(45), గూడూరు రమణ(45), వేమిరెడ్డి భారత(70)లుగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగంలో వారికి చికిత్స అందిస్తున్నారు.

సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు మధిర వాసులు దుర్మరణం చెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.