Tuesday, November 12, 2024

ఆఫ్గన్‌లో తాలిబన్ సభ్యుల కాల్పులు.. 12మంది మృతి

- Advertisement -
- Advertisement -

కాబుల్: ఆప్ఘనిస్తాన్‌లోని హేరత్ ప్రావిన్సులో శుక్రవారం రాత్రి తాలిబన్ సైన్యానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమ సొంత మిలీషియా సభ్యులపై కాల్పులు జరపగా 12 మంది మరణించినట్లు హేరత్ ప్రావిన్సు పోలీసు ప్రతినిధి తెలిపారు. దీన్ని అంతర్గత దాడిగా ఆయన పేర్కొన్నారు. కాల్పులు జరిపిన అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు మరణించిన మిలీషియా సభ్యుల వద్ద నున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పరారయ్యారని ఆయన చెప్పారు. అనంతరం ఆఫ్ఘన్ ప్రభుత్వ సైనిక బలగాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయని ఆయన తెలిపారు. అంతర్గత దాడి చేసింది తామేనని తాలిబన్ ప్రతినిధి యూసఫ్ అహ్మదీ శనివారం ట్వీట్ చేశారు. ఇలా ఉండగా..దేశ రాజధాని కాబుల్ నగర శివార్లలో పోలీసులకు చెందిన ఒక వాహనంపై శనివారం ఉదయం బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించగా మరో వ్యక్తి గాయపడినట్లు కాబుల్ పోలీసు ప్రతినిధి ఫిర్దావా ఫరమర్జ్ తెలిపారు. ఈ బాంబు దాడికి బాధ్యులమంటూ ఎవరూ ఇప్పటివరకు ప్రకటించలేదు.

12 Kills after Taliban firing in Afghanistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News