Tuesday, September 17, 2024

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Seven injured in road accident in Shamshabad

ముంబయి: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో శుక్రవారం ఉక్కు కడ్డీలతో వెళుతున్న ఒక లారీ బోల్తాపడి 12 మంది కార్మికులు మరణించారు. సింద్‌కేద్రజా-మెహకర్ రహదారిలోని దుసర్‌బిడ్ గ్రామ సమీపంలోని మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన సంభవించింది. నాగపూర్-ముంబయి సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు పనుల కోసం కార్మికులను తీసుకెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. హైవే ప్రాజెక్టు కోసం ఉక్కును తీసుకెళుతున్న వాహనంలో మొత్తం 16 మంది కార్మికులు ప్రయాణిస్తున్నట్లు ఆయన చెప్పారు. రోడ్డుపై పెద్ద గుంత ఉన్న కారణంగా వాహనం బోలాపడిందని, ఈ సంఘటనలో 12 మంది కార్మికులు మరణించగా మిగిలిన వరు గాయపడ్డారని బుల్దానా ఎస్‌పి అరవింద్ చావ్రియా చెప్పారు. మరణించిన కార్మికులలో చాలా మంది బీహార్, ఉత్తర్ ప్రదేశ్‌కు చెందినవారని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News