Thursday, April 25, 2024

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్…

- Advertisement -
- Advertisement -

Marijuana

హైదరాబాద్ : గంజాయిని రవాణా చేస్తూ విక్రయించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మల్కాజిగిరిలోని ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ లక్ష్మణ్ నాయక్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. లాలు తాండ, లక్ష్మీ దేవి పల్లి కొత్త గూడెం జిల్లాకు చెందిన వంకుడోత్ సురేష్ (29) ఆటో డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవిసిస్తున్నాడు. ఆటో నడుపగా వచ్చిన ఆదాయం సరిపోక పోవడంతో తెలిసిన వ్యక్తుల ద్వారా గంజాయిని విక్రయించే పనిని గత ఆరు నెలలుగా చేస్తున్నాడు.

ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖ జిల్లా సీలేరు ప్రాంతం నుండి రూ. 5 వేల చొప్పున 120 కిలోలు గంజాయిని కొనుగోలు చేసాడు. రెండు కిలోల చొప్పున 60 బ్యాగుల్లో గంజాయిని ప్యాకింగ్ చేసి అక్కడి నుండి కారులో నగరానికి తీసుకువచ్చి కొంతమందికి విక్రయించాలనుకున్నాడు. ఈ క్రమంలో కారులో వస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులు మౌలాలిలోని జెడ్‌టిసి చౌరస్తాలో సురేష్‌ను వలపన్ని పట్టుకున్నారు. 120 కిలోల గంజాయి, కారును స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

12 Lakh Worth of Marijuana Seized in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News