Home అంతర్జాతీయ వార్తలు లోయలో పడిన బస్సు… 12 మంది భక్తులు మృతి

లోయలో పడిన బస్సు… 12 మంది భక్తులు మృతి

Bus Accident

 

ఖట్మాండూ: బస్సు ప్రమాదంలో 12 మంది భక్తులు మృతి చెందిన సంఘటన నేపాల్‌లోని సింధూపాల్‌చౌక్ ప్రాంతంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దోలాఖా ఖడిచౌర్-జిరి రోడ్డులో బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోతుగల లోయలో పడడంతో ఘటనా స్థలంలో 12 మంది దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సులోని 40 మంది భక్తులు కలించౌక్‌లో దేవుడిని దర్శనం చేసుకొని భక్త్‌పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

12 Members Dead in Bus Fell into Goerge in Nepal, bus were travelling on skidded off the road along the Dolakha Khadichaur-Jiri road section in Sunkoshi