Home అంతర్జాతీయ వార్తలు నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి

నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి

12 people killed, 19 missing in Nepal landslides

 

ఖట్మాండు: పశ్చిమ నేపాల్‌లో శుక్రవారం వేర్వేరు చోట్ల కొండ చరియలు విరిగిపడిన సంఘటనల్లో 12 మంది మరణించగా మరో 19 మంది గల్లంతయ్యారు. కస్కి జిల్లాలోని పోఖరా నగరానికి చెందిన సారంగ్‌కోట్, హెమ్‌జన్ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున పోఖరలోని సారంగ్‌కోట్‌లో కొండచరియలు విరిగిపడి ఒక ఇల్లు కొట్టుకుపోవడంతో ఐదుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదే సంఘటనలో మరో 10 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి కొండ చరియలు విరిగిపడిన రెండు సంఘటనల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ సంఘటన లాంజంగ్ జిల్లాలోని బేసిషహర్‌లో జరిగింది. రుకుమ్ జిల్లాలోని ఆత్బిస్‌కోట్‌లో మరో ఇద్దరు మరణించారు. జజోర్‌కోట్ జిల్లాలోని కొండచరియలకు విరిగిపడడంతో రెండు ఇళ్లు కొట్టుకుపోగా 12 మంది గల్లంతయ్యారు. మ్యాగ్ది జిల్లాలో ఒక ఇల్లు కొట్టుకుపోవడంతో ఏడుగురి ఆచూకీ తెలియడ

12 people killed, 19 missing in Nepal landslides