Home తాజా వార్తలు నిట్‌లో గంజాయి సేవించిన 12 మంది విద్యార్థుల సస్పెండ్

నిట్‌లో గంజాయి సేవించిన 12 మంది విద్యార్థుల సస్పెండ్

marijuana

 

వరంగల్ : నిట్ వరంగల్‌లో గంజాయి సేవిస్తూ పట్టు బడ్డ 12 మంది విద్యార్థులను నిట్ రిజిస్ట్రార్ ఎస్.గోవర్దన్‌రావు సస్పెండ్ చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సస్పెండ్‌కు గురైన విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం కోల్పోతున్నట్లు తెలిపారు. అక్టోబర్ 26వ తేదీన నిట్ క్యాంపస్‌లోని 1.8 కె హాస్టల్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న 12 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ సెక్యూరిటీ సిబ్బంది చేతికి చిక్కారని, ఈ ఘటనపై క్రమశిక్షణ కమిటీ వేసిన నిట్ రిజిస్ట్రార్ ఎస్.గోవర్దన్‌రావు వారిపై చర్యలు తీసుకున్నారు. వారిని సస్పెండ్ చేస్తున్నట్ల తెలిపారు. జులై 2020 వరకు వీరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. వారు తిరిగి అడ్మిషన్ పొందడానికి జులై 2020లో అవకాశం పొందవచ్చన్నారు.

12 students suspended for smoking marijuana in NIT