Home జాతీయ వార్తలు అయ్యప్ప దర్శనానికి 12 ఏళ్ల బాలిక

అయ్యప్ప దర్శనానికి 12 ఏళ్ల బాలిక

Sabarimala

 

ఆపేసిన పోలీసులు

శబరిమల: కేరళలోని సుప్రసిద్ధ శబరిమల అయ్య ప్ప స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన 12 సంవత్సరాల బాలికను పోలీసులు అడ్డుకున్నారు. తమిళనాడుకు చెందిన బాలికతన తల్లిదండ్రులు, ఇతర బంధువులతో కలిసి మంగళవారం ఉద యం శబరిమలకు రాగా పంబ వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఆధార్ కార్డులో బాలిక వయ సు 12 సంవత్సరాలుగా ఉండడంతో ఆమెను అడ్డుకున్నారు. బాలికను తమతో పాటుగా పం పించాలని తల్లిదండ్రులు ఎంతగా ప్రాధేయపడినప్పటికీ పోలీసులు అందుకు అంగీకరించలేదు. బాలికను అనుమతించేది లేదని, కుటుంబ సభ్యు లు అయ్యప్ప దర్శనం చేసుకుని తిరిగి వచ్చే వర కు బాలికకు బేస్‌కాంప్ వద్ద రక్షణ కల్పిస్తామని స్పష్టం చేయడంతో చేసేది లేక కుటుంబ సభ్యులు ఆమెను అక్కడే వదిలి దర్శనం కోసం వెళ్లారు ఇది లా ఉండగా పదినుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహఙళలను ఆలయంలోకి అనుమతించరాదన్న ఆలయ సంప్రదాయాలను కర్నాటక నుంచి వచ్చి న ఓ తొమ్మిదేళ్ల బాలిక తాను వేచి ఉండడానికి సిద్ధంగా ఉన్నానని,

50 ఏళ్లు వచ్చాకే ఆలయాన్ని దర్శించుకుంటానని రాసిఉన్న ఒక ప్లకార్డును మెడలో వేసుకుని అందరి దృష్టినీ ఆకట్టుకుంది. వాస్తవానికి కేరళలోని త్రిసూర్‌కు చెందిన హృద య్ కృష్ణన్ అనే ఆ బాలిక తాను ఇప్పటికి మూడు సార్లు ఆలయాన్ని దర్శించానని, 50 ఏళ్లు వచ్చాకే ఆలయాన్ని దర్శించుకుంటానని చెప్పింది. కాగా సంప్రదాయాలను, విశ్వాసాలను కాపాడేవారే నిజమైన భక్తుని ఆమె తండ్రి హరికృష్ణన్ చెప్పారు. వార్షిక మండల పూజ నిమిత్తం శబరిమల ఆలయాన్ని గత శనివారం తెరిచిన విష యం తెలిసిందే. ఆ రోజున అయ్యప్ప దర్శనం కోసం వచ్చి న పదిమంది తెలుగు మహిళలను ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం వెనక్కి పం పించి వేశారు.

సోమవారం కూడా మరో ఇద్దరు మహిళలను వెనక్కి పంపించేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పదినుంచి 50 ఏళ్ల లోపు వయసు మహిళలను దర్శనానికి అనుమతించడం కుదరదని పోలీసులు తేల్చి చెప్పారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబర్‌లో తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కాగా గతంలో ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం ఎలాంటి స్టే విధించనప్పటికీ భద్రతా కారణాల దృష్టా 10 50ఏళ్ల మధ్య వయసు మహిళలను అనుమతించకుండా కేరళ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

12 year old barred from proceeding to Sabarimala temple