Home జాతీయ వార్తలు తిట్టిందన్న కోపంతో ప్రిన్సిపాల్‌ను హత్య చేసిన బాలుడు

తిట్టిందన్న కోపంతో ప్రిన్సిపాల్‌ను హత్య చేసిన బాలుడు

deathముంబై: తన స్నేహితుల ముందు తనను తిట్టిందన్న కోపంతో ఒక 12 ఏళ్ల మైనర్ బాలుడు తన స్కూలు ప్రిన్సిపాల్‌నే కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన గోవండిలోని శివాజీ నగర్‌లో జరిగింది. ఒక ప్రైవేట్ స్కూలులో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల ఆయేషా అస్లాం హెసుయే గత ఐదేళ్లుగా ఆ బాలుడికి తన ఇంటి వద్ద ట్యూషన్ చెబుతోంది. ప్రిన్సిపాల్ వద్ద నుంచి రూ. 2,000 అప్పు తీసుకోవాలంటూ తన తల్లి చెప్పడంతో ఆ బాలుడు సోమవారం స్కూలులో అయేషాను అడిగాడు. అయితే ఆమె గట్టిగా మందలించడంతో తన మిత్రుల వద్ద ఆ బాలుడు అవమానంగా భావించాడు.

సాయంత్రం 8 గంటలకు ట్యూషన్‌కు వెళ్లిన ఆ బాలుడు తన వెంట తీసుకెళ్లిన కత్తితో ఆమెను పొడిచాడు. ఆయేషా కేకలకు పరుగున వచ్చిన పొరుగువారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించనట్లు డాక్టర్లు నిర్ధారించారు. తన భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆయేషా ఒంటరిగా ఉంటోంది. హత్య చేసిన తర్వాత కూడా ఆ బాలుడు అక్కడే ఉండిపోయినట్లు పోలీసులు చెప్పారు. ఆ మైనర్ బాలుడిని డోంగ్రిలోని రిమాండ్ హోమ్‌కు పోలీసులు తరలించారు. ఆ బాలుడు గడియకో మాట మారుస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఆయేషా హత్య వెనుక పెద్ద కుట్రే ఉండవచ్చని ఆమె కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. 2010లో ఆమె తండ్రి కూడా ఆస్తి తగాదాల కారణంగా హత్యకు గురయ్యాడు.

12 year old boy stabs school principal to death victim, 30-year-old Ayesha Aslam Husuyae, had also been privately coaching the boy at her home for the past five years.