Home జాతీయ వార్తలు తమిళనాడులో దళిత బాలుడి హత్య

తమిళనాడులో దళిత బాలుడి హత్య

Dalith

సోదరి, తల్లిపై అత్యాచారం
విల్లుపురం : తమిళనాడులో ఒక దళిత కుటుంబంపై దాడి జరిగింది. ఈ ఘటనలో 12 సంవత్సరాల దళిత బాలుడు మృతి చెందగా, బాలుడి సోదరి, తల్లి గాయపడ్డారు. విల్లుపురానికి సమీపంలోని వెల్లపుత్తూర్ గ్రామం లో దాదాపు వారం రోజుల క్రితం జరిగిన దాడి ఇప్పుడు వెలుగులోకి వ చ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ కుటుంబంపై దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి సోదరి, తల్లిపై లైంగిక దాడి జరిగిందని, వారికి వై ద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. బాలికను తల్లిని పుదుచ్చేరికి సమీపంలోని జిప్మెర్ వైద్య సంస్థలో చికిత్సకు చేర్పించారు. దళిత కుటుంబంపై దాడికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిఎంకె నాయకులు, ఎంపి అన్బుమణి రామదాస్ డిమాండ్ చేశారు. దుండగులు బాలుడిని చంపివేశారని, ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగిందని, స్పృహ లేని స్థితిలో వారు ఘటనా స్థలి లో పడి ఉన్నారని తెలిపారు. వారి తలలకు బలమైన గాయాలు అయ్యాయ ని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక భూ వివాదానికి సంబంధించి గ్రామస్థు లు దళితులపై దాడులు సాగిస్తున్నారని, ఈ క్రమంలోనే ఈ దారుణాలు జరిగాయని రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. బాలుడిని గొంతుకోసి చంపివేశారని, మహిళలపై అమానుష రీతిలో అత్యాచారం జరిగిందని నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.