లక్నో : 12 ఏళ్ల బాలుడు చోరీ చేసిన వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ ఎస్ బి ఐ బ్రాంచ్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. బ్యాంకులోకి వచ్చిన 12 ఏళ్ల బాలుడు అందరి కళ్లు కప్పి కాసేపు అక్కడే తిరిగాడు ఆనంతరం రూ. 3 లక్షల నగదు ఉన్న బ్యాగును దొంగిలించాడు. కొద్దిసేపటికి నగదు కనిపించకపోవడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. హూటాహుటిన ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సిసిటివి పుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#WATCH 12 year old boy steals Rs 3 lakhs from an SBI branch in Rampur. Police have begun investigation pic.twitter.com/koLTHgZ9ON
— ANI UP (@ANINewsUP) March 16, 2018