Home జోగులాంబ గద్వాల్ ఒకే గ్రామంలో 12 మందికి కానిస్టేబుల్ కొలువులు…

ఒకే గ్రామంలో 12 మందికి కానిస్టేబుల్ కొలువులు…

ts-police

 

అలంపూరు: ఒకే గ్రామంలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 మంది యువకులు పోలీసు ఉద్యోగం సాధించి గ్రామస్థులు, శాసన సభ్యుడితో శాలువా, పూలమాలలతో సన్మానాలందుకున్నారు. గద్వాల జిల్లా అలంపూరు మండలలోని లింగనవాయి గ్రామంలో ఇటీవల వెలువడిన పోలీసు కానిస్టేబుల్ ఫలితాలలో ఏకంగా 12 మంది యువకులు ఉద్యోగం సాధించారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వారిని ఆదివారం అలంపూరు ఎమ్మెల్యే అబ్రహం ఆ గ్రామ ప్రంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మనోజ్ కుమార్ రెడ్డి, గ్రామ ఎంపిటిసి సభ్యురాలు జ్యోతి ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగం సాధించిన వారిని, వారి తల్లిదండ్రులను, వారి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

12 youth Selected for TS Constable job from Alampur