Home Default డేటా సైంటిస్ట్ జాబ్ కొట్టిన ఏడో తరగతి బాలుడు..

డేటా సైంటిస్ట్ జాబ్ కొట్టిన ఏడో తరగతి బాలుడు..

 

హైదరాబాద్: అతి చిన్న వయస్సులోనే ఓ బాలుడు సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ సంపాదించి ఔరా అనిపిస్తున్నాడు. నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న సిద్ధార్థ శ్రీవాత్సవ్ పిల్లే అనే బాలుడిని డాట సైంటిస్ట్ గా నగరంలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ నియమించింది. పిన్న వయస్సులోనే సైన్స్ అండ్ టెక్నాలజీ, కోడింగ్ పై ఎంతో ఆసక్తిని పెంచుకున్న సిద్ధార్థ్.. తండ్రి ప్రోత్సాహంతో తన సైన్స్ పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపర్చుకున్నాడు. దీంతో సిద్ధార్థ్ సైన్స్ స్కిల్స్ చూసిన మాంటైగ్నే స్మార్ట్ బిజినెస్ సొల్యుషన్స్ అతడికి జాబ్ ఆఫర్ ఇచ్చింది. చాలా యంగ్ ఏజ్ లో గూగుల్ లో జాబ్ సంపాదించిన తన్మయ్ భక్షి తనకు ఆదర్శమని సిద్ధార్థ్ చెబుతున్నాడు. సమాజానికి సేవ చేయడమే తన లక్ష్యమని ఈ యువ డేటా సైంటిస్ట్ తెలిపాడు.

12 yrs old boy hired as data scientist by software firm