Home జాతీయ వార్తలు భారత్ లో కొత్తగా 12,059 కరోనా కేసులు నమోదు

భారత్ లో కొత్తగా 12,059 కరోనా కేసులు నమోదు

12059 New Corona Cases Registered In Indiaన్యూఢిల్లీ : గడిచిన ఒక్కరోజులో బారత్ లో కొత్తగా 12,059 మంది కరోనా బారినపడ్డారని కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం ఉదయం మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 1,08,26,363 మందికి కరోనా సోకిందని వారు చెప్పారు. గడిచిన ఒక్కరోజులో కొత్తగా 11,805 మంది కరోనా నుంచి కోలుకున్నారని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 1,05,22,601 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. గడిచిన ఒక్కరోజులో 78 మంది కరోనా కారణంగా చనిపోయారని, దీంతో మృతుల సంఖ్య 1,54,996కు చేరిందని వారు వెల్లడించారు.  ప్రస్తుతం దేశంలో 1,48,766 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వారు చెప్పారు. శనివారం దేశవ్యాప్తంగా 6,95,789 కరోనా పరీక్షలు చేశామని, ఇప్పటి వరకు 20,13,68,378 కరోనా పరీక్షలు చేశామని వారు వెల్లడించారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని వారు స్పష్టం చేశారు. రోడ్ల మీదకు వచ్చినప్పుడు ఆరు గజాల సామాజిక దూరం పాటించడంతో పాటు విదిగా మాస్కులు దరించాలని అధికారులు ప్రజలను కోరారు.