Home Default భారత్ లో కొత్తగా 12,428 కరోనా కేసులు నమోదు

భారత్ లో కొత్తగా 12,428 కరోనా కేసులు నమోదు

12428 new corona cases registered in Indiaన్యూఢిల్లీ : గ‌డిచిన ఒక్కరోజులో భారత్ లో  కొత్త‌గా 12,428 కరోనా  పాజిటివ్ కేసులు న‌మోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం ఉదయం తెలిపారు. గడిచిన ఒక్కరోజులో కరోనాతో 356 మంది చనిపోయారని,  క‌రోనా నుంచి  15,951 మంది కోలుకున్న‌ారని వారు తెలిపారు.  ప్ర‌స్తుతం భారత్ లో 1,63,816 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కేర‌ళ‌లో గడిచిన ఒక్కరోజులో 6,664 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయని,  53 మంది కరోనాతో చనిపోయారని అధికారులు చెప్పారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అదికారులు తేల్చిచెప్పారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు విదిగా సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని అదికారులు ప్రజలను కోరారు.