Home తాజా వార్తలు తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

 

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గురువారం కరోనాతో మరో ఆరుగురు మరణించినట్లు తెలిపింది.జిహెచ్ఎంసి పరిధిలో 110 మందికి కరోనా సోకగా.. రంగారెడ్డి 6, ఆదిలాబాద్ 7, మేడ్చల్ 2, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3,147కు చేరుకోగా.. కరోనా బారిన పడి ఇప్పటివరకు 105మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 1,455 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

127 New Corona Cases Reported in Telangana