Friday, April 19, 2024

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్‌లో 13 మందికి కరోనా..

- Advertisement -
- Advertisement -

 Delhi lieutenant governor

న్యూఢిల్లీ : ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో 13 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ పరీక్షలో తేలినట్టు బైజాల్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. నీతి అయోగ్ అధికారికి కరోనా పాజిటివ్ కనిపించిన రోజు తరువాత తాజాగా 13 మందికి బయటపడింది. సోమవారం నీతి అయోగ్ కార్యాలయం మూడో అంతస్తును శానిటైజ్ చేయడానికి మూసివేశారు. ఈ వారం మొదట్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వవిభాగానికి చెందిన ఇద్దరు అధికారులకు కరోనా పోజటివ్ సోకింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటింది.

ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆన్‌లైన్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా రోగులకు ఆస్పత్రిలో పడకలు లభ్యమయ్యేలా అధికార యంత్రాంగం యాప్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆస్పత్రిలో పడక కల్పించడానికి తిరస్కరిస్తే 1031 నెంబరుకు కాల్ చేయాలని సూచించారు. తమ ప్రత్యేక కార్యదర్శి చొరవ తీసుకుని ఆస్పత్రిలో పడక ఏర్పాటు చేయిస్తారని భరోసా ఇచ్చారు.

13 Corona Test for Positive in Delhi lieutenant governor Office

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News