Tuesday, April 16, 2024

రెండు రోజుల్లో 13 మంది అరెస్టు…. డ్రగ్స్ కేసులు

- Advertisement -
- Advertisement -

రెండు రోజుల్లో 13మంది అరెస్టు సైబరాబాద్‌లో డ్రగ్స్ కేసులు

13 Members arrested in drug case

మనతెలంగాణ, సిటిబ్యూరో: సైబరాబాద్ పోలీసులు డ్రగ్స్, గంజాయి, గుట్కా విక్రయిస్తున్న నిందితులపై ఉక్కుపాదం మొపుతున్నారు. వరుసగా గత కొంత కాలం నుంచి దాడులు చేస్తు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. రెండు రోజుల్లో చేపట్టిన డ్రగ్స్ డ్రైవ్‌లో 13మందిని అరెస్టు చేసి కటకటాలకు పంపించారు. గత నెల 30,31వ తేదీత్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో గంజాయి రవాణా, విక్రయిస్తున్న 13మందిని పట్టుకున్నారు. వారిపై ఆరు కేసులు నమోదు చేసి, నిందితుల వద్ద నుంచి 2.640 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు గంజాయి విక్రయించే వారి సమాచారం ఉంటే వెంటనే సైబరాబాద్ పోలీసుల నంబర్ 9490617444, లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News