Saturday, April 20, 2024

డబ్బు లేక… బంధువులు రాక…

- Advertisement -
- Advertisement -
Funeral
బాలుడి అంతిమయాత్రలో తల్లి, తాత మాత్రమే …

భద్రాద్రి : కరోనా కన్నా పేదరికమే ఆ కుటుంబం పట్ల శాపమైంది. భర్త లేని ఆమెను కొడుకు మరణం కలిచివేసింది. కరోనా నేపథ్యంలో కొడుకు అంతిమయాత్రకు బంధువులు హాజరు కాకపోవడంతో తన తండ్రితో కలిసి ఆమె కొడుకు అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన భద్రాద్రి పట్టణంలోని సుందరయ్యనగర్ కాలనీలో జరిగింది. ఈ కాలనీకి చెందిన ఓ మహిళ ముస్లిం వ్యక్తిని 13 ఏళ్ల క్రింతం పెళ్లి చేసుని తన పేరును ఫరీదాగా మార్చుకుంది. ఈ క్రమంలో ఆమెకు ఒక బాబు ( సాదిక్ ) పుట్టాడు. పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు.

అప్పటి నుంచి కూలీ పనులు చేసుకుంటూ జీవితం సాగిస్తోంది. గత కొంతకాలంగా సాదిక్ గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్నాడు. ఆదివారం సాయంత్రం సాధిక్ ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు. బాలుడి మృతిపై బంధువులకు సమాచారం ఇచ్చారు. కానీ రవాణా సౌకర్యాలు లేకపోవడం, దూరాభారం కావడంతో బాబుకు అంత్యక్రియలు నిర్వహించేదుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఫరీదా తన తండ్రి రిక్షాపై సాదిక్ మృతదేహానికి అంత్యక్రియలు చేసింది. ఈ ఘటన అందరినీ కలిసి వేసింది.

13 Years Old funeral in Rickshaw At Bhadradri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News