Home నిజామాబాద్ పీఠం కోసం చైర్మన్ ఎత్తులు

పీఠం కోసం చైర్మన్ ఎత్తులు

13lakhs Goverment Aproved For Baldiya Devlopmentsనతెలంగాణ/బోధన్: బోధన్ రాజకీయం రోజురోజుకు మలుపు తిరుగుతో ంది. బల్దియా సభ్యులంతా ఎమ్మెల్యే గద్దె దింపేందుకు చాలెంజ్‌గా తీసుకోగా పరిస్థితులను గమనించిన చైర్మన్ ఎల్లయ్య కౌన్సిలర్లపై మానసికంగా పైచేయి సాధించాలని ఈవో సూచించినట్లు తెలుస్తుంది. అందుకు తాను దళితుడు కావడాన్ని అనుకూలంగా మలుచుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు తనతో సన్నిహితంగా ఉన్న దళిత సంఘాల నేతలతో చర్చించిన ఆయన ఓ వైపు ఎమ్మెల్యే షకీల్‌తో సంప్రదింపులు జరుపుతూనే మరోపక్క కౌన్సిలర్లపై దళిత కార్డు ద్వారా పైచేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తాను మొదట ఆవేదనతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా అనంతరం దళిత సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం గమనార్హం. తాజాగా ఒక అడుగు ముందుకు వేసిన దళిత సంఘాలు ఏకంగా బోధన్ బంద్‌కు 14వ తేదీన పిలుపునివ్వడం రాజకీయ వేడి పుట్టించింది. మరోవైపు ఈ పరిణామాలన్నీంటిని ఎమ్మెల్యే షకీల్ నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం. రాజకీయంగా నష్టం జరగకుండా ఎమ్మెల్యే సైతం వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య ఎత్తులు వేస్తూ ఎమ్మెల్యే షకీల్‌పై దళిత సంఘాల ప్రోద్బలంతో పదవి కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బోధన్ మున్సిపల్ చైర్మన్ తీరుకు నిరసనగా అధికార పార్టీ నాయకులు ముందుండి ప్రతిపక్ష పార్టీలతో కలిసి అ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావ్, 29 మంది కౌన్సిలర్లు రాతపూర్వకంగా సంతకాలు చేసి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

చైర్మన్ ఒంటెద్దు పోకడలు పోతూ కాంట్రాక్టర్లను గుప్పిట్లో పెట్టుకుని బల్దియా అభివృద్ధ్దిని విస్మరించారని బాహాటంగానే కౌన్సిలర్లు చెబు తూ అవిశ్వాసానికి కాలు దువ్వారు. ఎంఐఎం నాయకులు ఇదే అదనుగా భావి ంచి ఎమ్మెల్యే షకీల్‌ను అప్రతిష్ఠపాలు చేయాలనే అక్కసుతో వ్యూహాన్ని రచించినట్లు విమర్శలు తలెత్తుతున్నాయి. బోధన్ బల్దియా చైర్మన్ పదవి జనరల్ అభ్యర్థికి కేటాయించినప్పటికీ దళిత వర్గానికి చెందిన ఎల్లయ్యను చైర్మన్ పదవిలో కూర్చోబెట్టేందుకు మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే షకీల్ వ్యూహం పన్ని ఎంఐఎంకు చైర్మన్ పదవి దక్కకుండా చేశారని అదే అక్కసుతో ఎంఐఎం కౌన్సిలర్లు వ్యూహానికి ప్రతివ్యూహాం పన్నినట్లు తెలుస్తుంది. దళిత వర్గాల ఓట్లను చీల్చి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చేయాలని ప్రతిపక్షపార్టీలు పన్నాగం పన్ని చైర్మన్‌పై అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లను సైతం తమవైపు మళ్ళించుకుని గద్దెదింపేందు కు వ్యూహాన్ని పన్నినట్లు విమర్శలున్నాయి. ఒక పక్క ప్రతిపక్షాలను తిప్పి కొట్టేందుకు ముందుచూపుతో వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేకు మరోపక్క దళిత సంఘాల నిరసన కార్యక్రమాలు ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. చైర్మన్‌పై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గత నాల్గు రోజుల నుండి దళిత సంఘాల ఆధ్వర్యంలో బోధన్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ఆందోళన కార్యక్రమా లు చేపడుతు ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన కౌన్సిలర్లను ఎమ్మెల్యే బుజ్జగింపు చేస్తున్నప్పటికీ చైర్మన్ వ్యవహార శైలిపై వ్యతిరేకంగా ఉన్న కౌన్సిలర్లు తాము వెనెక్కి తగ్గినట్లైతే పరువుకు భంగం కల్గుతుందని ఏదీ ఏమైనప్పటికీ చైర్మన్‌ను గద్దెదించడం ఖాయమంటూ కౌన్సిలర్లు ఉడుం పట్టుతో ఉన్నారు. చైర్మన్ తన పదవిని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేవా అనే సందిగ్ధం నెలకొంది.
పంపకాలలో తేడా
బల్దియా అభివృద్ధ్దికి రూ.13.55 లక్షలు నిధులు మంజూరైనప్పటికీ చైర్మన్ మో నోపొలిగా వ్యవహరించి ఏ ఒక్క కౌన్సిలర్లకు పంచకుండా కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయ్యాడని పేర్కొంటూ కౌన్సిలర్లు చైర్మన్‌పై ఎదురుదాడికి దిగారు. ఆది నుండి చైర్మన్ కౌన్సిలర్‌ను కలుపుకుని పనిచేసేవాడు కాదని సొంత పార్టీ నాయకుల వద్ద పర్సెంటేజ్ తీసుకుని పనులు చేశారని కౌన్సిలర్లు విమర్శలు కురిపిస్తున్నారు.