Saturday, March 25, 2023

పోలీస్ ప్రజావాణిలో 14 ఫిర్యాదులు

- Advertisement -

complaint

మన తెలంగాణ/ వికారాబాద్ జిల్లా : జిల్లా ఎస్‌పి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 14 ఫిర్యాదులను జిల్లా ఎస్‌పి అన్నపూర్ణ స్వీకరించారు. బొంరాస్‌పేటలో భూమి వివాదానికి సంబంధించి ఒక ఫిర్యాదు, నవాబుపేటలో కుటుంబ వివాదానికి సంబంధించి ఒక ఫిర్యాదు, వికారాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించడానికి హిందూ జనజాగృతి సమితి ఒక ఫిర్యాదు అందింది. అదేవిధంగా మరో 11 ఇతర ఫిర్యా దులు అందాయి. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను స్వయంగా ఎస్‌పి అన్నపూర్ణ తెలుసుకున్నారు. ఫిర్యాదు ఏఏ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్నాయో ఆయా పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News