Thursday, November 7, 2024

ఎపి మాజీమంత్రి అఖిలప్రియకు 14రోజుల రిమాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఎపి మాజీమంత్రి అఖిలప్రియకు మెజిస్ట్రేట్ ఈనెల 20వ తేదీ వరకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఈ రోజు రాత్రి అఖిలప్రియ బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఉండనుంది. రేపు ఉదయం అఖిలప్రియను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించే అవకాశం ఉంది. కాగా, ఈ కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న  అఖిలప్రియను అరెస్టు చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగానే ఆమె కళ్లు తిరిగి పడిపోయింది. అయితే, కేవలం నీరసంతో కళ్లు తిరిగి పడిపోయిందని వైద్యులు తేల్చిచెప్పారు. అంతకుమంచి అఖిలప్రియకు ఎలాంటి ఆనారోగ్య సమస్యలు లేవని వైద్యులు రిపోర్టు ఇచ్చారు. ఆసుపత్రి నుంచి ఆమెను తీసికెళ్లే సమయంలో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా కార్యక్రమాన్ని ముగించాయి. అఖిల ప్రియను న్యాయమూర్తి నివాసంలో పోలీసులు హాజరుపర్చడంతో రిమాండ్ విధించారు.

14 days remand to AP Ex Minister Akhila Priya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News