Home తాజా వార్తలు శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Gold

 

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం 14 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నామని డిఆర్ఐ అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన  ఇద్దరు విదేశీయులు ఎలాంటి పత్రాలు లేకుండా ఎయిర్ ఇండియా విమానంలో కూర్చున్న సీట్ల కింద ఉన్న 14 కిలోల బంగారం తీసుకువచ్చారు. అరెస్టు అయిన ఇద్దరు విదేశీయులను చైనా, సౌత్ కొరియా దేశానికి చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ కనీసం రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

14 KGs Gold Seized At Shamshabad Airport In Rangareddy