Home జాతీయ వార్తలు 14 మంది దుర్మరణం

14 మంది దుర్మరణం

Bus-Accident

 

యూపీలో ట్రక్కును ఢీకొన్న బస్సు

ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంబఃవించింది. ఫిరోజాబాద్ జిల్లాలోని నగ్లాఖాంగార్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారంరాత్రి ఒక ప్రయాణికుల బస్సు అగిఉన్న లారీని ఢీకొట్టడంతో 14 మంది చనిపోగా, మరో 25 మంది గాయపడినట్లు అధికారులు గురువారం చెప్పారు. క్షతగాత్రులను వివిధ ఆసత్రుల్లో చేర్చినట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సచిన్ పటేల్ చెప్పారు. రాత్రి పదిగంటల సమయంలో ఢిల్లీనుంచి మోతీహారి వెళ్తున్న డబుల్‌డెక్కర్ బసు ఆగిఉన్న ట్రక్కును ఢీకొన్నప్పుడు ఈ ప్రమాదం సంభవించినట్లు రూరల్ ఎస్‌పి కుమార్ చెప్పారు. ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 50 మంది ఉన్నారని ఆయన చెప్పారు.

క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. తాను పంక్చరైన ట్రక్కు టైరును మారుస్తుండగా వేగంగా వచ్చిన బస్సు వెనుకవైపునుంచి ట్రక్కును ఢీకొట్టిందని ,తనతో పాటు ్రట్రక్కు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడినట్లు ట్రక్కు క్లీనర్ చెప్పాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా ప్రమాదం పట్ల యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

14 killed in Bus Truck collision in Uttar Pradesh