- Advertisement -
టెహ్రాన్: ఆగ్నేయ ఇరాన్‌లో మంగళవారం సంభవించిన ఒక రోడ్డు ప్రమాదంలో 8 మంది పిల్లలతోసహా 14 మంది మరణించారు. మూడు కార్లు ఢీకొని ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియరానప్పటికీ ఈ ప్రమాదంలో మరో 14 మంది గాయపడినట్లు ఇరాన్ అధికార వార్తాసంస్థ ఐఎస్‌ఎన్‌ఎ తెలిపింది. పెర్షియన్ నూతన సంవత్సరం లేదా నౌరూజ్ ఉత్సవాలు శనివారం ప్రారంభమైన సందర్భంగా పెద్ద సంఖ్యలో ఇరాన్ పౌరులు సెలవుల్లో విహార యాత్రలకు బయలుదేరి వెళుతున్నారు. సిస్టాన్, బలూచిస్తాన్ ప్రావిన్సులోని జెహెదాన్ నగరం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఇరాన్ అత్యవసర విభాగ అధికార ప్రతినిధి మోజ్‌తాబా ఖలేదీ తెలిపినట్లు వార్తాసంస్థ పేర్కొంది. మృతులలో 3-8 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు బాలికలు, ఆరుగురు బాలురు, ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నట్లు ఆయన చెప్పారు.
14 Killed in Road Accident in Iran
- Advertisement -