Wednesday, April 24, 2024

యుపి రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -
14 killed in UP Road Accident
మృతులలో ఏడుగురు చిన్నారులు

లక్నో/ప్రతాప్‌గఢ్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో లక్నో-అలహాబాద్ హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఒక కారు ఢీకొనడంతో ఏడుగురు చిన్నారులతో సహా 14 మంది మరణించారు. ప్రతాప్‌గఢ్‌లోని నవాబ్‌గంజ్ ప్రాంతంలో ఒక వివాహ వేడుకల్లో పాల్గొని వీరంతా వాహనంలో తిరిగివస్తుండగా గురువారం రాత్రి ఈ ప్రమాదం సంభవించినట్లు రాష్ట్ర హోం శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్థి తెలిపారు. వేగంగా వస్తున్న ఎస్‌యువికి చెందిన వెనుకటైరు పేలిపోవడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొందని ప్రతాప్‌గఢ్ ఎస్‌పి అనురాగ్ ఆర్య తెలిపారు.

ప్రమాదం కారణంగా నుజ్జనుజ్జయిన ఎస్‌యువిలోనుంచి మృతదేహాలను వెలికితీయడానికి జెసిబిని ఉపయోగించాల్సి వచ్చింది. మృతదేహాలను కుందాలోని సిహెచ్‌సికి తరలించారు. ట్రక్కులోకి చొచ్చుకువెళ్లిన కారును బయటకు తీయడానికి దాదాపు రెండు గంటలు పట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా విచారం ప్రకటించారు. మృతులంతా కుందా పోలీసు స్టేషన్ పరిధిలోని జిర్గాపూర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

14 killed in UP Road Accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News