Saturday, April 20, 2024

స్కూల్ బస్సుపై ఉగ్రదాడి: 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Terror

ఔగడౌడౌ: బుర్కినో పాసోలో తీవ్రవాదులు రెచ్చిపోయారు. ఔగడౌడౌలో ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో 14 మంది ఘటనా స్థలంలో మృతి చెందగా 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మలి సరహద్దులోని సొరౌ ప్రొవిన్స్ ప్రాంతం తోయ్ని తౌగన్ రోడ్డులో క్రిస్మస్ సెలవులు ముగిసిన అనంతరం విద్యార్థులు బస్సులో స్కూల్‌కు వెళ్తుండగా ఉగ్రవాదులు బాంబులతో దాడి చేశారు. మృతులలో ఏడుగురు విద్యార్థులు, నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్టు సమాచారం. ఆల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ దాడికి పాల్పడి ఉంటుందని భద్రతా ఉన్నతాధికారులు వెల్లడించారు. వారం రోజుల క్రితం బుర్కినో పాసో ప్రాంతం మలి, నైగర్ ప్రాంతాలలో సరిహద్దు కలిగి ఉంది. ఈ ప్రాంతాల నుంచి ఉగ్రవాదులు బుర్కినో పాసోలోకి చొరబడి దాడులు చేస్తున్నారు. 2015 నుంచి తీవ్రవాదుల దాడులలో 750 మంది చనిపోగా 5.5 లక్షల మంది వలసపోయారు.

 

14 Members Dead in Terror attack in Burkina Faso, explosion happened in the Mali border as students returned to school after the Christmas holidays
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News