Friday, April 26, 2024

రెండు లక్షల ఇరవై వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1451 new covid 19 cases reported telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షల 20వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,20,675 కేసులు నమోదయ్యాయి. రాబోయే రెండు నెలల వరకు వైరస్ తీవ్రత ఇదే విధంగా కొనసాగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యశాఖ సూచించింది. ఇదిలా ఉండగా శుక్రవారం 42,497 టెస్టులు చేయగా 1451 పాజిటివ్‌లు తేలాయి.

వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 235 ఉండగా, ఆదిలాబాద్‌లో 8, భద్రాద్రి 92,జగిత్యాల 29, జనగాం 28, భూపాలపల్లి 22, గద్వాల 11, కామారెడ్డి 34, కరీంనగర్ 65 ,ఖమ్మం 71, ఆసిఫాబాద్ 7, మహబూబ్‌నగర్ 32 , మహబూబాబాద్ 24, మంచిర్యాల 22, మెదక్ 25, మేడ్చల్ మల్కాజ్‌గిరి 101, ములుగు 20, నాగర్‌కర్నూల్ 22, నల్గొండ 84, నారాయణపేట్ 15, నిర్మల్ 24, నిజామాబాద్ 32, పెద్దపల్లి 28, సిరిసిల్లా 30, రంగారెడ్డి 104, సంగారెడ్డి 32, సిద్ధిపేట్ 64, సూర్యాపేట్ 37, వికారాబాద్ 22, వనపర్తి 24, వరంగల్ రూరల్ 28, వరంగల్ అర్బన్ లో 55, యాదాద్రిలో మరో 24 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,20,675 కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 1,96,636 కి చేరింది. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు 1265 మంది చనిపోయారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా, 1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

89 శాతానికి పెరిగిన రికవరీ రేట్….

రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారు వేగంగా కోలుకుంటున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మెరుగైన వైద్యం అందించడం వలనే ఇది సాధ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతోనే రికవరీ రేట్ 89.1 చేరిందని వైద్యశాఖ వివరించింది. ఇది దేశ సగటు 87.7 కంటే అధికంగా ఉండటం గమనార్హం.

3869 మందికి హాస్పిటల్ చికిత్స…..

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన వారిలో ప్రస్తుతం కేవలం 3869 మంది మాత్రమే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు హెల్త్ బులెటెన్‌లో ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,20,675 పాజిటివ్‌లు తేలగా, 1,96,636 మంది ఆరోగ్యవంతులుగా మారారు. దీంతో శుక్రవారం వరకు 22,774 యాక్టివ్ కేసులుండగా, 18,905 మంది ఐసోలేషన్ సెంటర్లలోనే చికిత్స పొందుతున్నారు. గత రెండు నెలలతో పోల్చితే కరోనా చికిత్సకు ఆసుపత్రులను ఆశ్రయించే వారి సంఖ్య దాదాపు 50 శాతం తగ్గింది. అత్యధికంగా ఐసోలేషన్ సెంటర్లలోనే కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు.

1451 new covid 19 cases reported telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News