Friday, March 29, 2024

15 ఇంటర్నల్ బస్‌స్టేషన్లు

- Advertisement -
- Advertisement -
15 internal bus stations in hyderabad
3 సంవత్సరాల క్రితమే ఆర్టిసికి హెచ్‌ఎండిఏ ప్రతిపాదనలు
ఎండి సజ్జన్నార్ రాకతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు

మన తెలంగాణ/సిటీబ్యూరో: ఒక వైపు నగరం వేగం గా విస్తరిస్తూ విశ్వనగరం దిశగా అడుగులు వేస్తోంది. దీంతో పాటే అంతే వేగంగా కాలనీలు, బస్తీలు పెరిగి పోతున్నాయి. అయితే అంతే వేగంగా ప్రజారవాణా వ్యవస్థ అభివృద్ది చెందక పోవడంతో ప్రజలు వ్యక్తిగత వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.దాంతో నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ గందరగోళంగా మారుతోంది. 5 సంవత్సరాల క్రితం గంటకు 25 నుంచి 30 కిలో మీ టర్ల వేగంతో ప్రయాణించే వాహనాల వేగం ప్రస్తుతం గంటకు 15 నుంచి 20లోపునకు పడిపోయింది. ట్రా ఫిక్ సంబంధిత సమస్యలు (దారి మళ్ళింపు, ధర్నాలు, ఆందోళనలు) కారణంగా వాహనాలన్నీ ఒకే దారిలో ప్రయాణిస్తుండటంతో వాటి వేగం 5 నుంచి 10 పడిపోతోంది. దీంతో నగరంలో కాలుష్యం కూడా భారీ ఎత్తును పెరిగిపోతోంది. ఇదే పరిస్థతి భవిష్యత్తులో కూడా కొనసాగితే పరిస్థితి ఏమిటి? దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ముఖ్యంగా రవాణా పెరుగుదల వ్యవస్థపై సుమారు మూడు సంవత్సరాల క్రితమే హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో 5వ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ నాటి హెచ్‌ఎండిఏ కమిషర్ చిరంజీవులు ఆధ్వర్యంలో జరిగింది. అయితే అప్పటి నాటి నుంచి వరుసగా సంస్థకు నష్టాలు రావడంతో దానిపై ఎవరూ అంతగా దృష్టి సారించలేదు. ఎండి సజ్జన్నార్ రాకతో నాటి ప్రణాళికలను అమల్లోకి తీసుకు వచ్చేందుకు తీవ్ర కసరత్తు జరుగుతోంది.

ఆర్టిసి తనకు ఉన్న సుమారు 2500 బస్సులతో 29 డిపోల ద్వారా ప్రతి రోజు 25 లక్షల మందికి ప్రయాణికులను ప్రయాణికులను గ్యమస్థానాలకు చేరుస్తోంది. నగరం విస్తరిస్తుండటంతో పూర్తి స్థాయిలో ఆర్టిసి సేవలను అందించలేకపోతుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు తద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందిచేందుకు కమిటీ 15 ఇటర్ననల్ బస్టేషన్స్ (ఎమినిటీ సెంటర్స్) బేగం పేట, వైఎంసిఏ, తార్నాక, రాజేంద్రనగర్, ఫోర్ట్ రోడ్, షామీర్‌పేట, కీసర, తారామతి, రావిరాల, తుక్కుగూడ, మామిడిపల్లి, బుద్వేల్ (ఐటీ పార్క్), టిఎస్‌పిఏ (తెలంగాణ పోలీస్ అకాడమీ), పటాన్ చెరు, దుండిగల్‌లో ఏర్పాటు చేయాలని ఆర్టిసికి ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హయత్‌నగర్, హకీంపేట, కాచిగూడ, కోఠీ, కూకట్‌పల్లి, రేతిఫిల్ ఆయా ప్రాంతాల ప్రయాణికులను అవసరాలను తీరుస్తున్నాయని, మరో 15 బస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తే శివారు ప్రాంతాల్లో ఉండే ప్రయాణికుల అవసరాలను తీర్చడమే కాకుండ నగరంలో అస్తవ్యస్థంగా ఉన్న ట్రాఫిక్ వ్యవస్థను నియంత్రణలోకి తీసుకురావచ్చని పేర్కొంది.

ఈ 15 బస్టేషన్ల అందుబాటులోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ఉన్న టెర్మినల్స్ సంఖ్య 21కు పెరుగుతుంది. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న బస్ రూట్లకు మరో 35 రూట్లలో అఫ్జల్‌గంజ్- టూ కుషాయిగూడ, అఫ్జల్‌గంజ్ టూ -సికింద్రాబాద్, మెహదీపట్నం- టూ ఈసీఐఎల్, సికింద్రాబాద్- టూ జూ పార్క్, ఈసిఐఎల్- టూ -సికింద్రాబాద్, రాజీవ్‌గాంధీ ఎయిర్ పోర్టు –టూ సి కింద్రాబాద్, బహదూర్‌పురా– టూ సికింద్రాబాద్, ఈసిఐఎల్ –టూ సుచిత్ర, సికింద్రాబాద్ – టూ ఓల్డ్ అల్వాల్, జీడిమెట్ల- టూ సికింద్రాబాద్, కోఠీ – టూ -సికింద్రాబాద్, ఫిల్మ్‌నగర్- టూ సికింద్రాబాద్, సికింద్రాబాద్ –టూ మె హదీపట్నం, నాగోల్- టూ అఫ్జల్ గంజ్ , జియాగూడ — టూ సికింద్రాబాద్, రాజేంద్రనగర్- టూ మెహదీపట్నం, కోఠీ — టూ రాజేంద్రనగర్, దిల్‌షుక్‌నగర్ – టూ -సికింద్రాబాద్, ఉప్పల్ టూ -కోఠీ, ఈసీఐఎల్– ఉప్పల్, కోఠీ టూ -కొండాపూర్, జీడిమెట్ల- -టూ మెహదీపట్నం, జెఎన్టీయు టూ -విబిఐటి, బాచుపల్లి -టూ వేవ్‌రాక్, కోఠీ టూ –పటాన్ చెరు, మేడ్చెల్ టూ సికింద్రాబాద్, మెహదీపట్నం –టూ మేడ్చెల్, శంషాబాద్- టూ – కోఠీ, ఇబ్ర హీం పట్నం- టూ — ఐబిఎస్, రామోజీ ఫిల్మ్ సిటీ –టూ ఐ బిఎస్, బాలాజీ టెంపుల్ టూ — మెహదీపట్నం ప్రాంతాలకు బస్ రూట్లను విస్తరించాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News