Home అంతర్జాతీయ వార్తలు కూలిన మెట్రో రైలు వంతెన: 15 మంది మృతి

కూలిన మెట్రో రైలు వంతెన: 15 మంది మృతి

మెక్సికో: మెట్రో రైలు వంతెన కూలిపోవడంతో రైలు బోగీలు కిందపడిపోవడంతో 15 మంది మృతి చెందిన సంఘటన మెక్సికో నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దక్షిణా మెక్సికోలో ఓ వెంతనపైకి రెండు మెట్రో రైలు వచ్చినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించగా 70 మంది వరకు గాయపడ్డారని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్ బౌమ్ తెలిపారు. ప్రభుత్వాధికారులు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్రేన్ సహాయంతో బోగీలను పక్కకు తొలగిస్తున్నారు.