Home అంతర్జాతీయ వార్తలు బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం : 15 మంది మృతి

బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం : 15 మంది మృతి

Trains Collisionఢాకా : బంగ్లాదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున రెండు రైళ్లు ఢీకొన్నాయి. 15 మంది ఘటనాస్థలిలోనే చనిపోయారు.  మరో 58 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఢాకా-బౌండ్ ఇంటర్‌సిటీ రైలు, చిట్టగాంగ్‌కు వెళ్లో లోకోమోటివ్ రైలు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. కస్బా పట్టణంలోని మొండోల్‌బాగ్ స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయని వారు వెల్లడించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నామని రైల్వే అధికారులు చెప్పారు.

15 Passengers Dead In Trains Collision At Bangladesh