Home తాజా వార్తలు గేదెల పంపిణీ

గేదెల పంపిణీ

Minister Talasani Met with MAA Representatives at Secretariat

ప్రతి నెలా 15వేల మందికి ఇవ్వడానికి రంగం సిద్ధం

మన తెలంగాణ/హైదరాబాద్: మొదటి విడతలో 15 వేల మంది లబ్ధిదారులకు పాడి గేదెలను పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఇలా ప్రతి నెలా 15 వేల నుంచి 16 వేల పాడి పశువులను హర్యానా, పంజాబ్, తమిళనాడు, కర్నాట క, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుం చి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సచివాలయంలో మంత్రి తలసాని సబ్సిడీ పాడి పశువుల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయ, కరీంనగర్, ముల్కనూర్, మదర్ డెయిరీలకు పాలు పోస్తున్న 2.13 లక్షల మంది రైతులకు సబ్సిడీపై పాడిగేదెలు, పాడి ఆవులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కొనుగోలు చేసిన ప్రతి గేదెకు తప్పనిసరిగా ఇన్సూరెన్సు చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు 2,3 రోజుల్లో మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు తెలిపారు. ఒక్కో పాడిగేదెకు రూ.80 వేలు కాగా ఇందులో ఎస్‌సి, ఎస్‌టిలకు 75 శాతం సబ్సిడీ, బిసిలకు 50 శాతం సబ్సిడీని వర్తింపజేయనున్నట్లు వివరించారు. ఇప్పటికే గేదెలు కొనుగోలు చేయనున్న రాష్ట్రాలలో లభ్యత, నాణ్యతను పరిశీలించేందుకు డెయిరీ ప్రతినిధులు, అధికారులు, రైతులతో కూడిన బృందాలు పర్యటించినట్లు తెలిపారు. లబ్ధిదారులతో పాటు వైద్యులు, డెయిరీ ప్రతినిధులు, పశుసంవర్థక శాఖ అధికారులతో కూడిన బృందం వెళ్లి గేదెలను కొనుగోలు చేస్తారన్నారు. కొనుగోలుపై 2.13 లక్షల మంది సభ్యులకు తెలుగులో కరపత్రంరూపంలో ముద్రించి అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రతి బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ (బిఎంసి)ల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ఇందుకు అధికారులు, స్థానిక డెయిరీ సిబ్బందితో కూడిన 300 బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో సబ్సిడీ గేదెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విజయ డెయిరీ ఛైర్మన్ లోక భూమారెడ్డి ఈ కార్యక్రమాన్ని ఇతర డెయిరీ ఛైర్మన్‌లతో సమన్వయం చేస్తారని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విజయ డెయిరీ ఎం.డి నిర్మ ల, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఎం.డి లకా్ష్మరెడ్డిలతో డెయిరీల ఛైర్మన్‌లు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించినవిలీన గ్రామాల్లో నివసిస్తున్న గొల్ల, కురమలకు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, వనపర్తి, కొల్హాపూర్‌లలో నివసిస్తున్న కురుమ, కురవ కులస్తులకు సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు రూ.3700 కోట్లతో 65 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు చెప్పారు.