Home తాజా వార్తలు తెలంగాణలో కొత్త‌గా 152 మందికి కరోనా

తెలంగాణలో కొత్త‌గా 152 మందికి కరోనా

152 New Corona Cases Registered In Telanganaహైదరాబాద్ : తెలంగాణలో గడిచిన ఒక్కరోజులో కొత్త‌గా 152 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గురువారం ఉదయం మీడియాకు తెలిపారు. గడిచిన ఒక్కరోజులో కరోనాతో ఇద్ద‌రు చనిపోయారని, 114 మంది కోలుకున్నారని వారు వెల్లడించారు. ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,406కి చేరిందని, ఇప్పటివరకు మొత్తం 2,95,821 మంది కోలుకున్నారని, 1,637 మంది కరోనాతో చనిపోయారని వారు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో  1,948 మంది కరోనాతో బాధపడుతూ  చికిత్స పొందుతున్నారని వారు పేర్కొన్నారు. ఇందులో  835 మంది హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన ఒక్కరోజులో కొత్తగా 25 మంది కరోనా బారిన పడ్డారని అధికారులు తెలిపారు. స్వీయనియంత్రణతోనే కరోనాా కట్టడి సాధ్యమని వారు స్పష్టం చేశారు. అత్యవసర పనులు ఉంటే రోడ్ల మీదకు రావాలని, రోడ్ల మీదకు వచ్చినప్పుడు ఆరు గజాల సామాజిక దూరం పాటించడంతో పాటు విధిగా మాస్కులు ధరించాలని వారు ప్రజలను కోరారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు తేల్చిచెప్పారు. ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.