Friday, April 19, 2024

జిల్లాల్లోనూ విజృంభణ

- Advertisement -
- Advertisement -

1524 New Corona Cases reported in Telangana

13175 టెస్టులు..1524 పాజిటివ్‌లు
జిహెచ్‌ఎంసిలో 815, జిల్లాల్లో 709 మందికి వైరస్
వైరస్ దాడిలో మరో పది మంది మృతి
37,745 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1524 పాజిటివ్‌లు తేలాయి. మంగళవారం 13175 టెస్టులు చేశామని అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు 24 గంటల్లో చేసిన పరీక్షల్లో ఈ సంఖ్యే గరిష్ఠం. అదే విధంగా వైరస్ దాడిలో మరో పది మంది చనిపోయారని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది కొత్తగా వైరస్ సోకిన వారిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 815 మంది ఉండగా, రంగారెడ్డి 240, మేడ్చల్ 97, సంగారెడ్డి 61, ఖమ్మం 19, వరంగల్ అర్బన్ 30, వరంగల్ రూరల్ 2, నిర్మల్ 3, కరీంనగర్ 29, జగిత్యాల 2, మెదక్ 24, మహబూబ్‌నగర్ 7, మంచిర్యాల 12, భద్రాది 8, భూపాలపల్లి 12, నల్గొండ 38, సిరిసిల్లా 19, ఆదిలాబాద్ 7, ఆఫిసాబాద్ 5, వికారబాద్ 21, నాగర్‌కర్నూల్ 1, జనగాం 4, నిజామాబాద్ 17, ములుగు 6,వనపర్తి 5, సిద్ధిపేట్ 4, సూర్యాపేట్ 15, గద్వాలలో 13 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం వైరస్ సోకిన వారిలో ఖైరతాబాద్‌లో ఓ వైద్యుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దీంతో వెల్‌నెస్ సెంటర్‌ను మూసివేసినట్లు అక్కడ అధికారులు ప్రకటించారు. అంతేగాక కేసులు అధికంగా ఉన్న చార్మినార్‌ను రెడ్‌జోన్‌గా డిక్లేర్ చేశారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 37745కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 24,840కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 12531మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 375కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో 89.4 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో 998 పరుపులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఉస్మానియా సూపరింటెండెంట్ డా నాగేంద్రకు కరోనా సోకడంతో ఇంచార్జీ సూపరింటెండెంట్‌గా పాండు నాయక్ నియామకం అయినట్లు అధికారులు తెలిపారు.
పిఐబి రిపోర్టును తప్పు పట్టిన హెల్త్ డైరెక్టర్…
పిఐబి(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ప్రకటించిన కోవిడ్ 19 బులెటిన్ వివరాల్లో తప్పులు ఉన్నాయని హెల్త్ డైరెక్టర్ డా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 36,221, యాక్టివ్ కేసులు 12,178, మరణాలు 365, డిశ్చార్జ్‌ల సంఖ్య 23,679 ఉండగా, పిఐబి మొత్తం కేసులు 33019, యాక్టివ్ కేసులు 15144, డిశ్చార్జ్ 17,467, మరణాలను 408గా ప్రకటించిందని ఆయన చెప్పారు. పిఐబి ప్రకటించిన వివరాల్లో తప్పులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, హైకోర్డు అడిగిన ప్రశ్నలకు డిహెచ్ స్పష్టమైన సమాధానం చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రంలో సింప్టమ్స్ ఉన్న వారికే టెస్టులు చేస్తున్నామని, ఆయన న్యాయస్థానానికి వివరించారట. మరోవైపు యంటీజెన్లలో నెగటివ్ వస్తే ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం మరోసారి ఆర్‌టిపిసిఆర్ టెస్టు చేయాల్సి వస్తుందని, దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో మొదట్లో యాంటీజెన్ కిట్లపై ఆసక్తి చూపలేదని ఆయన కోర్డుకు వివరించినట్లు పేర్కొన్నారు.

1524 New Corona Cases reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News