Home జాతీయ వార్తలు భారత్ ను వణికిస్తున్న కరోనా

భారత్ ను వణికిస్తున్న కరోనా

152879 Corona Cases Registered In Indiaన్యూఢిల్లీ : భారత్ లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గడిచిన ఒక్కరోజులో భారత్ లో కొత్తగా 1,52,879 మంది కరోనా బారినపడినట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు ఆదివారం ఉదయం మీడియాకు తెలిపారు. గడిచిన ఒక్కరోజులో కరోనా కారణంగా 839 మంది  చనిపోయారని వారు చెప్పారు.  తాజాగా నమోదైన కేసులతో భారత్ లో మొత్తం కరోనా‌ కేసుల సంఖ్య 1,33,58,805కు చేరిందని వారు వెల్లడించారు. గడిచినఒక్కరోజులో  90,584 మంది కోలుకోవడంతో , ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,20,81,443కు చేరిందని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు కరోనాతో   1,69,275 మంది చనిపోయారని, ప్రస్తుతం భారత్ లో 11,08,087 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 10,15,95,147 మందికి కరోనా టీకాలు వేసినట్టు తెలిపారు.  శనివారం ఒక్కరోజే 14.12లక్షల మందికి కరోనా పరీక్షలు చేశామని, దీంతో పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య 25 కోట్ల 66 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశామని వారు వెల్లడించారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు తేల్చిచెప్పారు. అత్యవసర పనులు ఉంటేనే బయటికి రావాలని, బయటకు వచ్చినప్పుడు విధిగా ఆరు అడుగుల సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని వారు ప్రజలను కోరారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కేంద్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.