Tuesday, March 19, 2024

రాష్ట్రంలో మరో 1550 పాజిటివ్‌లు..

- Advertisement -
- Advertisement -

1550 New Corona Cases reported in Telangana

11525 టెస్టులు, 1550 పాజిటివ్‌లు
వైరస్ దాడిలో మరో 9 మంది మృతి
కొంపల్లి మున్సిపల్ కమిషనర్‌కు కరోనా
కోవిడ్‌తో కాంగ్రెస్ నేత మృతి
36,221కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో కరోనా కేసులు 36వేల మార్కును దాటాయి. సోమవారం 11525 టెస్టులు చేయగా, 1550 మందికి పాజిటివ్‌లు తేలాయి. దీంతో పాటు వైరస్ దాడిలో మరో 9 మంది చనిపోయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా వైరస్ సోకిన వారిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 926 మంది ఉండగా, రంగారెడ్డి 212, మేడ్చల్ 53, సంగారెడ్డి 19, ఖమ్మం 38, కామారెడ్డి 33, వరంగల్ అర్బన్ 16, వరంగల్ రూరల్ 8, నిర్మల్ 1, కరీంనగర్ 86, యాదాద్రి 5, మహబూబ్‌నగర్ 13, మంచిర్యాల 1, భద్రాది 10, భూపాలపల్లి 6, నల్గొండ 41, సిరిసిల్లా 7, ఆదిలాబాద్ 1, వికారాబాద్ 3, నాగర్‌కర్నూల్ 2, జనగాం 10, నిజామాబాద్ 8, వనపర్తి 1, సిద్దిపేట్ 10, సూర్యాపేట్ 10, గద్వాల్‌లో ఐదుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 36,221కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 23,679కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 12178మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 365కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో 89.2 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. కేవలం గాంధీ ఆసుపత్రిలో 1013 పరుపులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.
కోంపల్లి మున్సిపల్ కమిషనర్‌కు కరోనా..
కోంపల్లి మున్సిపల్ కమిషనర్‌కు కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఆమె ప్రైమరీ కాంటాక్ట్‌లతో పాటు కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
కరోనాతో కాంగ్రెస్ నేత మృతి..
కరోనాతో కాంగ్రెస్ నేత జి.నరేందర్ యాదవ్ మరణించారు.ఇటీవల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనకి కోవిడ్ పాజిటివ్ తేలింది. దీంతో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
నిజామాబాద్ సూపరింటెండెంట్ రాజీనామా…
నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెండ్ డా నాగేశ్వరావు రాజీనామా చేసినట్లు సమాచారం. తన రాజీనామాను ఉన్నతాధికారులకు వాట్సాప్ ద్వారా పంపించినట్లు తెలిసింది. ఇటీవల సంభవిస్తున్న వరుస సంఘటనలతో మనస్థాపం చెంది ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అతని సన్నిహితులు వెల్లడిస్తున్నారు.

1550 New Corona Cases reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News