Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎపిపై కరోనా ఎఫెక్ట్ : 1576 కొత్త కేసులు… 15మంది మృతి

ఎపిపై కరోనా ఎఫెక్ట్ : 1576 కొత్త కేసులు… 15మంది మృతి

1576 New Corona Positive Cases in APఅమరావతి: ఎపిలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1576 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 15 మంది కరోనా బారిన పడి చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 లక్షల 15వేల 635 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా బారిన పడిన 13,194 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్నారు. ప్రస్తుతం 11936 మంది కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా  అనంతపురంలో 191కేసులు, తూర్పుగోదావరిలో 169, కర్నూలు, పశ్చిమగోదావరిలో 144 చొప్పున, గుంటూరులో 136, ప్రకాశంలో 110 కరోనా కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఈ ఒక్కరోజే  అత్యధికంగా 208 కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. కరోనాతో ఇప్పటి వరకు 292 మంది చనిపోయినట్టు వారు వెల్లడించారు. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుండడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సహకరించినప్పుడే కరోనా కట్టడి సాధ్యమని వారు స్పష్టం చేశారు. అత్యవసర పనుల కోసం మాత్రమే బయటకు రావాలని, బయటకు వచ్చినప్పుడు సామాజిక దూరం పాటించడంతో పాటు విధిగా మాస్క్ లు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.