Home జాతీయ వార్తలు భారత్ లో కొత్తగా 15,786 కరోనా కేసులు నమోదు

భారత్ లో కొత్తగా 15,786 కరోనా కేసులు నమోదు

15786 New Corona Cases Registered In Indiaన్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 15,786 మంది కరోనా బారినపడినట్టు కేంద్ర కుటుంబ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొత్త కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 3,41,43,236కు చేరిందని వారు వెల్లడించారు. ఈ మొత్తం కేసుల్లో 1,75,745 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వారు చెప్పారు. గడిచిన 24 గంటల్లో 231 మంది చనిపోయారని, దీంతో కరోనా మృతుల సంఖ్య 4,53,042కు పెరిగిందని అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే అత్యధికంగా 8,733 కేసులు ఉన్నాయని వారు చెప్పారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు తేల్చిచెప్పారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని, బయటకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని, ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని వారు ప్రజలను కోరారు.